విశాఖపట్నం పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో సోమవారం(జులై13) రాత్రి సుమారు 11గంటల సమయంలో పరిశ్రమ నుంచి భారీ పేలుడు సంభవించింది. సాల్వెంట్ కంపెనీలో పేలుడుతో పాటు భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. పరిశ్రమ నుంచి 2,3 కి.మీ. వరకు మంటలు కనిపిస్తున్నాయి. కాగా విశాఖలో వరుస ప్రమాదాలతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
