మార్కెట్లోకి హెచ్‌ఎంఎస్‌ఐ బీఎస్‌-6 సీడీ డ్రీమ్‌ బైక్‌

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ)..మార్కెట్లోకి బీఎస్‌-6 ప్ర మాణాలతో కూడిన సీడీ 110 డ్రీమ్‌ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.62,729 (ఎక్స్‌షోరూమ్‌). ఈ కొత్త బైక్‌ను ఇంజన్‌ స్టార్ట్‌/స్టాప్‌, లాంగర్‌ సీల్‌, ట్యూబ్‌లెస్‌ టైర్స్‌ వంటి అదనపు ఫీచర్లతో తీసుకువచ్చినట్లు తెలిపింది. ఐకానిక్‌ సీడీ బ్రాండ్‌… ప్రపంచవ్యాప్తంగా 1966 నుంచి లక్షలాది మంది వినియోగదారుల మనసును చూరగొందని పేర్కొంది.