మార్కెట్లోకి వివో వై90

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ వివో తన వై సీరీస్‌ మొబైల్‌ ఫోన్లలో తక్కువ ధర కలిగిన వై90ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6.22 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌లో 2జిబి రామ్‌, 16జిబి ఇంటర్నల్‌ మెమరీ, 4030 ఎంఎహెచ్‌ బ్యాటరీ, ముందు 5ఎంపి, వెనుక 8 ఎంపి కెమెరాలు ఫీచర్లుగా ఉన్నాయి. ఫేస్‌ యాక్సెస్‌ టెక్నాలజీ ఫీచర్‌ను పొందుపర్చింది. జులై 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్‌ ధరను రూ.6,990గా నిర్ణయించింది.