మద్యం హోం డెలివరీకి జొమాటో..!

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో మద్యం ప్రియులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొన్ని రాష్ట్రాలు మద్యం హోం డెలివరీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు మద్యం అందజేస్తున్నారు. మరోవైపు కేంద్రం ఆదేశాల మేరకు దాదాపు 45 రోజుల తర్వాత పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కూడా మద్యం డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో మద్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని జొమాటో భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన చర్చలు కూడా జరుపుతోంది.