మంత్రి దేవినేనిపై వంశీ వ్యాఖ్యలు

విజయవాడఃఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరోక్ష ఆరోపణలు చేశారు. కాగా, సోమవారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం కుడికాల్వ రైతులకు విద్యుత్‌ సరఫరా కట్‌ చేయడం దారుణమన్నారు. మైలవరం నియోజకవర్గంలో మాత్రం ప్రభుత్వ డబ్బుతో నీరు తోడిస్తున్నారన్నారు. రైతుల పొలాల్లో నీళ్లు లేక నారు మళ్లు ఎండిపోతున్నాయన్నారు. ఈ వ్యవహారంపై అతి త్వరలో సీఎం చంద్రబాబును క లవనున్నట్టు ఎమ్మెల్యే వంశీ తెలిపారు.