భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. గత నాలుగురోజులుగా దేశంలో ప్రతిరోజూ రికార్డుస్థాయిలో 8వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 8909 కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనా వైరస్ బయటపడిన అనంతరం 24గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో బుధవారం నాటికి దేశంలో కొవిడ్-19 బారినపడ్డ వారిసంఖ్య 2,07,615కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
