భారత్‌లో వైరస్‌ వివిధ రకాలుగా రూపాంతరం

చైనా, యూరప్‌లలో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌ రకమే రూపాంతరం చెంది భారత్‌లోనూ విస్తృతంగా వ్యాపించినట్లు జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ)కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. అలా కరోనా వైరస్‌ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని తెలిపారు. దిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్‌ ఎక్కువగా రూపాంతరం చెందినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.