భారతీయ సూచికలు ఆకుపచ్చగా ముగిశాయి; నిఫ్టీ 12,900 మార్క్;
సెన్సెక్స్ 247 పాయింట్లకు పైగా పెరిగింది

ఆటో మరియు ఫైనాన్షియల్ స్టాక్స్ ప్రధాన మద్దతుదారులుగా ఉండటంతో వరుసగా మూడవ రోజు ఆకుపచ్చ రంగులో ముగిసిన బెంచిమార్కు సూచీలు
నేటి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి, నిఫ్టీ 0.50% లేదా 64.05 పాయింట్లు పెరిగి 12,900 మార్కు పైన 12,938.25 వద్ద ముగిసింది, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.52% లేదా 227.34 పాయింట్లు పెరిగి 44,180.05 వద్ద ముగిసింది.
ఎం అండ్ ఎం (10.36%), టాటా మోటార్స్ (9.49%), బజాజ్ ఫిన్సర్వ్ (6.46%), ఎల్ అండ్ టి (5.82%), మరియు ఇండస్ఇండ్ బ్యాంక్ (5.91%) నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. మరోవైపు, నిఫ్టీ నష్టపోయిన వారిలో బిపిసిఎల్ (2.93%), హెచ్‌యుఎల్ (1.96%), డాక్టర్ రెడ్డి (1.68%), హీరో మోటోకార్ప్ (1.40%), భారతి ఎయిర్‌టెల్ (1.39%) ఉన్నారు.
రంగాలసంబంధిత ముగింపులో, నిఫ్టీ ఆటో 3% పెరిగింది, బ్యాంక్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచికలు వరుసగా 1.9% మరియు 1.3% పైగా పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 1.26 శాతం, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 0.90 శాతం పెరిగాయి.
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్.
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్స్ 5.51% పెరిగాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ తన తదుపరి సమావేశంలో వాటాలను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు నివేదించిన తరువాత, స్క్రిప్ రూ. 118.75 ల వద్ద ట్రేడ్ అయింది.
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్
కొత్త కె 2 సిరీస్ ట్రాక్టర్‌ను తెలంగాణలో తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కె2 ఎం అండ్ ఎం యొక్క జహీరాబాద్ సదుపాయంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడిని పెంచుతుంది మరియు ప్లాంట్ లో ఉపాధిని రెట్టింపు చేస్తుంది. కంపెనీ స్టాక్స్ 10.36% పెరిగి రూ. 703.25 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
వండర్లా హాలిడేస్ లిమిటెడ్.
నవంబర్ 20, 2020 నుండి ప్రజల కోసం ఈ థీమ్ పార్కులో వాటర్ రైడ్లను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫలితంగా కంపెనీ స్టాక్స్ 8.92% పెరిగి రూ. 194.20 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్
టాటా స్టీల్ నుండి 46 యూనిట్ల కొమాట్సు మైనింగ్ పరికరాలను సరఫరా చేయడానికి ఎల్ అండ్ టి ఒక ఆర్డర్ ను పొందింది, ఇది సంస్థ యొక్క అతిపెద్ద నిర్మాణ మరియు మైనింగ్ వ్యాపార ఒప్పందం. కంపెనీ స్టాక్స్ 5.82% పెరిగి రూ. 1,143.85 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెడ్
ఈ బ్యాంకును నవంబర్ 17, 2020 నుండి డిసెంబర్ 16, 2020 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక నిషేధానికి గురిచేసింది. ఫలితంగా, నేటి ట్రేడింగ్ సెషన్ లో ఈ కంపెనీ స్టాక్స్ 19.94% తగ్గి, రూ. 12.45 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
సద్భావ్ ఇంజనీరింగ్ లిమిటెడ్
ఈ సంస్థ 2 ఇపిసి రోడ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టు విలువగా రూ. 1572.30 కోట్లు పొందినట్లుగా ఎన్.హెచ్.ఎ.ఐ నుండి అంగీకార లేఖ (LOA) ఇటీవల అందుకుంది. ఈ కంపెనీ స్టాక్స్ 2.34% పెరిగి రూ. 50.35 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

భారతీయ రూపాయి
దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఫ్లాట్ ట్రేడింగ్ సెషన్ మధ్య భారత రూపాయి స్వల్పంగా తగ్గి, యుఎస్ డాలర్‌తో 74.46 రూపాయలుగా నిలిచింది.
మిశ్రమ గ్లోబల్ మార్కెట్ సూచనలు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు భయంకరంగా పెరగడం వల్ల గ్లోబల్ మార్కెట్లు మిశ్రమ సూచనలను అంచనా వేస్తున్నాయి. పెరుగుతున్న కేసుల సంఖ్య తాజా లాక్డౌన్ మరియు బలహీనమైన రిటైల్ అమ్మకాల ముప్పు. నాస్‌డాక్ 0.21%, ఎఫ్‌టిఎస్‌ఇ 100 0.13%, నిక్కీ 225 1.10% తగ్గాయి. దీనికి విరుద్ధంగా, ఎఫ్‌టిఎస్‌ఎఫ్ ఎంఐబి మరియు హాంగ్ సెంగ్ వరుసగా 0.66% మరియు 0.49% పెరిగాయి.
అమర్ దేవ్ సింగ్
హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్