బైకుల ధర పెంచిన బజాజ్‌

బజాజ్‌ ఆటో తాను విక్రయించే దాదాపు అన్ని రకాల బైకుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పలు మోడళ్లపై రూ.2,950 వరకు ధర పెంచినట్లు బుధవారం వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ కీలక మోడల్‌ పల్సర్‌తో పాటుగా డిస్కవర్‌, ప్లాటిన మోటార్‌ సైకిళ్లు ప్రియం కానున్నాయి. ఈ మధ్య కాలంలోనే బజాజ్‌ డోమినర్‌ 400 ధర రూ.6,000 పెంచింది. అవెంజర్‌ 220 ధర మాత్రం పెరగలేదు. పల్సర్‌ 150 నియాన్‌పై రూ.2,950, వి15పై రూ.1,113, ప్లాటినా 100 ఇఎస్‌పై రూ.1,024 చొప్పున ధరలు పెంచేసింది. ఈ కంపెనీ ప్రారంభ మోడల్‌ సిటి 100 కెఎస్‌ ధర రూ.33,997గా ఉంది. హైఎండ్‌ మోడల్‌ డోమినర్‌ ధర రూ.1.80 లక్షలుగా ఉంది.