బెంగళూరు – మ్యూనిచ్ కు కొత్త లుఫ్తాన్సా విమానం

భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు మరియు 14 సంవత్సరాలలో ’యూరోప్ లోనే ఉత్తమ విమానాశ్రయం’ గా పేరొందిన, యూరోప్ యొక్క మొట్టమొదటి మరియు ఏకైక 5-స్టార్ ఎయిర్ పోర్ట్ మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఏర్పరుస్తుంది. లుఫ్తాన్సా ఈరోజు, బెంగళూరు-మ్యూనిచ్ మార్గంలో ఒక కొత్త విమాన సర్వీసు ప్రారంభించడాన్ని ప్రకటించింది.
ఈ క్రొత్త విమానం, 31 మార్చి 2020 నుండి, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు నుండి వారానికి ఐదుసార్లు, మ్యూనిచ్‌కు వెళుతుంది. లుఫ్తాన్జా, తమ ఇటీవలి, అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ ఎ 350-900ను వ్యాపార తరగతిలో 48 సీట్లతో మరియు ప్రీమియం ఎకానమీ తరగతిలో 21 సీట్లతో మరియు ఎకానమీ తరగతిలో 224 సీట్ల సామర్థ్యంతో నడుపుతూంది.

ఈ కొత్త మార్గం, రెండు అతి ముఖ్యమైన ప్రాంతీయ హబ్స్ మధ్య ఒక బలమైన అనుసంధానం కలిగిస్తుంది, ఇది దక్షిణ భారతదేశాన్ని, యూరోపియన్ మెయిన్ ల్యాండ్‌లోని అతి ముఖ్యమైన గేట్ వేతో నేరుగా అనుసంధానిస్తోంది. బెంగళూరులో తన కార్యనిర్వాహక విస్తరణతో, ఈ ఎయిర్‌లైన్, తన అత్యంత ప్రీమియం ట్రావెల్ అనుభవాన్ని బెంగళూరు మరియు కర్నాటకలోని మిగిలిన ప్రాంతాల ప్రయాణీకులకే కాకుండా కేరళ మరియు తమిళనాడు వారికి అందుతూ, యూరోప్‌కు అంతర్జాతీయ ట్రాఫిక్ పెరిగేందుకు దోహదపడు లక్ష్యం కలిగి ఉంది. లుఫ్తాన్జా, ఇదివరకే బెంగళూరు నుండి ఫ్రాంక్‌ఫర్ట్‌కు ఒక రోజువారి విమాన సేవని నిర్వహిస్తోంది.

దీని గురించి జార్జ్ ఎఫియిల్, సీనియర్ డైరెక్టర్ సేల్స్, లుఫ్తాన్జా గ్రూపు ఎయిర్ లైన్స్ యొక్క దక్షిణ ఆసియా విభాగం, ఇలా అన్నారు. “బెంగళూరు ఎయిర్‌పోర్ట్, భారతదేశపు ఐటి మరియు టెక్ హబ్, బెంగళూరును, అనుసంధానించడమే కాకుండా, దక్షిణ భారత ప్రాంతంలోని అనేక తదుపరి టైర్ నగరాలను కూడా అనుసంధానిస్తోంది. దక్షిణ భారతదేశంలో విదేశాలకు ప్రయాణించడానికి అనేకమంది ప్రయాణీకులు పెరుగుతున్నారు. ప్రీమియం ప్రయాణ అనుభవానికి ఎక్కువ డిమాండ్ ఉంది అది వ్యాపారమైనా లేదా విశ్రాంతి ఉద్దేశాలకైనా సరే, డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ విస్తరణ ద్వారా, లుఫ్తాన్జా, ఈ ప్రాంతం యొక్క పెరుగుతున్న అవసరాలను పూరించగలదని, యూరోప్‌లో వ్యాపారమే కాకుండా విశ్రాంతికి కూడా అనువైనదిగా ఉంచగలదని మేము భావిస్తున్నాము.”
టైమ్ టేబుల్ వివరాలు (అన్నీ స్థానిక సమయాలే):
వేసవి 2020బెంగళూరు – మ్యూనిచ్ LH 765 01:45 – 07:30
సోమ/బుధ/శుక్ర/శని/ఆదిమ్యూనిచ్ – బెంగళూరు LH 764  11:55 – 00:05+1 మంగళ/గురు/శుక్ర/శని/ఆది