విమాన టికెట్ బుకింగ్స్‌ ఆపండి: డీజీసీఏ

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు మే 4 నుంచి బుకింగ్స్‌ స్వీకరించడం ప్రారంభించాయి. విమానయాన సంస్థలకు భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. విమాన ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి బుకింగ్స్‌ స్వీకరించరాదని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బుకింగ్స్‌ నిలిపివేయాలని సూచించింది.