జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన సరికొత్త ఎస్ 1000 ఆర్ఆర్ సూపర్ బైక్‌ను భారత మార్కెట్లో గురువారం విడుదల చేసింది. దీని ధర రూ.18.50లక్షలు. గతేడాది మిలాన్‌లో జరిగిన ఈఐసీఎంఏ మోటార్‌సైకిల్ షోలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. తాజాగా దీన్ని భారత్ మార్కెట్లో కి తీసుకొచ్చారు. ఈ మోడల్లో వస్తున్న మూడోతరం బైక్ ఇది. 2009లో తొలి మోడల్‌ను తీసుకొచ్చారు. గత బైక్‌తో పోలిస్తే ఇంజిన్‌లోనూ, హెడ్ల్యాంప్లోనూ పలు మార్పులు చేర్పులు చేశారు. పాత బైక్‌తో పోలిస్తే ఇది 11 కేజీలు తక్కువ బరువు (197కేజీలు) ఉంటుంది. 998 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ అత్యధికంగా 204 బీహెచ్పీని ఉత్పత్తి చేస్తుంది. 113 ఎన్ఎం టార్క్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం 6 గేర్లు ఉంటాయి. ఇందులో రోడ్, రెయిన్, డైనమిక్ అండ్ రేస్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. వీటితో పాటు అదనంగా మూడు ‘ప్రో’ మోడ్‌లను కంపెనీ అందిస్తోంది. లాంచ్ కంట్రోల్, వేగాన్ని నియంత్రించేందుకు ఉపయోగించే పిట్లేన్ స్పీడ్ లిమిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6.5 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
