బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్

తెలుగు న్యూస్ మీడియాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆతడు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.

టీవీ9 నుంచి బయటకొచ్చి రీసెంట్ గా సాక్షి ఛానెల్ లో చేరాడు సత్తి. “గరంగరం వార్తలు” అనే కార్యక్రమాన్ని అక్కడ ప్రవేశపెట్టాడు. సాక్షి ఛానెల్ టీఆర్పీల్లో ఈ కార్యక్రమానిదే అగ్రస్థానం. మొదటి 4 స్థానాల్లో ఇదే నిలిచింది. ఇలా ఓ వైపు ప్రొగ్రామ్ క్లిక్ అవ్వగా, అలా కరోనా కరోనా బారిన పడ్డాడు సత్తి.

సత్తికి కరోనా సోకడంతో.. ఆయన టీమ్ మొత్తం ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. తన కార్యక్రమంతో దిల్ ఖుష్ దివ్య (టిక్ టాక్ ఫేమ్), వార్తల వాణి అనే ఇద్దరమ్మాయిల్ని పరిచయం చేశాడు సత్తి. ఇప్పుడు వాళ్లు కూడా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా “గరంగరం వార్తల” టీమ్ మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లిపోవడంతో.. సాక్షి ఛానెల్ కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మరో 2 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని ఆపేస్తారా.. లేక ఇదే టైటిల్ పైన మరేదైనా ప్రత్యామ్నాయం చూస్తారా అనేది తేలాల్సి ఉంది.

ఈ ప్రొగ్రామ్ ను నటుడు, రచయిత తణికెళ్ల భరణితో లాంఛ్ చేశారు. ఇప్పుడు ఆయనతోనే కొన్ని రోజులు (సత్తి లేకుండా) నడిపిస్తారేమో చూడాలి.