ప్ర‌భాస్ కొత్త‌కారు రిజిస్ట్రేష‌న్..

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభాస్‌ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్‌ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు సైతం ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. క‌రోనా టైమ్ కాబ‌ట్టి ప్ర‌భాస్‌ మాస్కు ధ‌రించే బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీంతో మాస్కులో ఉన్న హీరోతో ఫొటోలు దిగేందుకు అక్క‌డి జ‌నం ఉత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో వారిని నొప్పించ‌డం ఇష్టం లేని డార్లింగ్‌ ఫొటోల‌కు పోజిచ్చారు. ఇదిలా వుండ‌గా ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నారు. ఇందులో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. త‌న 21వ చిత్రాన్ని ‘మ‌హాన‌టి’ ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కత్వంలో చేయ‌నున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే జోడీగా న‌టించ‌నున్నారు