పొరపాటు చేస్తే భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం:కేటీఆర్‌

ఆర్థిక ప్రగతి కన్నా ప్రజల ప్రాణాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి ఆగిన తర్వాతే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పొరపాటు చేస్తే భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడికి భౌతిక దూరం ఒక్కటే మార్గమని చెప్పారు.