పేనియర్‌బై కు ఐఆర్‌డిఎ బీమా బ్రోకింగ్ లైసెన్స్

ఐఆర్‌డిఐఎ, ప్రముఖ స్థానిక ఫిన్ టెక్ నెట్వర్క్, పే నియర్ బై కు బీమా బ్రోకింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. నియర్ బై ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు ద్వారా, ఈ కంపెనీ బీమా విభాగంలో అడుగిడి, సామాన్యులకు వారి సమీప షాప్ లో చవకైన బీమా సౌకర్యాని అందించు లక్ష్యాన్ని కలిగి ఉంది. పేనియర్ బై యొక్క ప్రస్తుత నెట్వర్క్ దాదాపు 6 లక్షల రీటైలర్స్ గా ఉంది, ఇది కొత్త ఛానెల్ నిర్మించడానికి ఒక శక్తివంతమైన ఇంజన్ గా తోడ్పడుతుంది. ఇందులోని వారు ఎప్పుడూ బీమాను విక్రయించలేదు మరియు ఈ ఉత్పత్తిని ఎప్పుడూ కొననివారికి, విక్రయించడానికి శిక్షణ పొందలేదు. దీని లక్ష్యమేమిటంటే భారతదేశానికి బీమా అందించడం మరియు అందరికీ ఆర్థిక సంరక్షణను అందుబాటులోనికి తేవడం.

ఆవిష్కరణ వ్యూహంలో భాగంగా, పేనియర్ బై, మురళి అయ్యర్ ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యక్తిగత రిస్క్ మేనేన్మెంట్ లో 100 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం గల ఒక కంపెనీ, వీ కేర్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ సర్వీసులను స్వాధీనం చేసుకుంది. మురళి గారికి బీమా పరిశ్రమ యొక్క విస్తృత పరిజ్ఞానం ఉంది ఇది వీరి వినియోగదారులు మరియు పరిశ్రమ ద్వారా ఎంతగానో గౌరవించబడుతోంది. ఆయన బీమా సౌకర్యాన్ని సామాన్యులకు చేర్చడం అనే కంపెనీ విజన్ కు నాయకత్వం అందించి దారి చూపగలడు.

ఈ సందర్భంలో వ్యాఖ్యానిస్తూ, ఆనంద్ కుమార్ బజాజ్, ఫౌండర్ మరియు సిఇఓ, పే నియర్ బై, ఇలా అన్నారు, “ఐఆర్‌డిఎ లైసెన్స్ అనేది కేవలం ఒక అనుమతే కాదు, అది మనం బీమాను, మన 6 లక్షల మరియు వృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రధాన్ భాగస్వాముల ద్వారా ఒక అసమాన్యమైన సర్వీసును అందించే ఒక గురుతర బాధ్యత కూడా. పేనియర్ బై, ఈరోజు ప్రతి నెలా, 5 కోట్ల విశిష్ట వ్యక్తులకు, నీతి ఆయోగ్, డిఎఫ్‌ఎస్, సిడిడిపి మరియు ఆర్‌బైఐ విజన్ డాక్యుమెంట్ ఆఫ్ డిజిటల్ ఇండియా సహకారంతో, 4,000 కోట్లరూపాయల విలువగల ఆర్థిక చేరిక లావదేవీలకు వీలుకల్పిస్తోంది. దేశంలో అతి తక్కువ బీమా ఉనికి ఉండడంతో, ఎక్కువమంది భారతీయులు, జీవితాల అసంబద్ధతకు బలయ్యారు. మా నెట్వర్క్ ద్వారా బీమాను, అందరికీ సులభంగా అందుబాటులోనికి తీసుకురావడం ద్వారా మేము దీనిని పరిష్కరించగలమని ఆశిస్తున్నాను. నవతరం యొక్క ఉత్తమ బ్రోకింగ్ సంస్థలలో ఒకటైన, వీ కేర్ బీమా బ్రోకింగ్ సర్వీసులను మేము పొందడం వలన, వారి వెర్టికల్ నైపుణ్యతను మా పంపిణీ సామర్థ్యంతో మేళవించి, బీమాను అందరికీ అందుబాటులోని తీసుకురావడానికి వీలవుతుంది.”