పేటీఎం లో మెట్రో రైలు రూట్ సర్చ్ సేవలు

భారతదేశంలోని అతి పెద్ద డిజిటల్ చెల్లింపుల కంపెనీ అయిన పేటీఎం నేడు హైదరాబాద్ తో పాటు ఇతర మెట్రో రైలు ప్రయాణికుల సౌకర్యం కోసం రూట్ సర్చ్ సేవ ను ఆవిషరించింది – ఇది, మెట్రో రైలు ప్రయాణీకులు వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు ఉపయోగించదగిన అంశం. ఈ అంశం, మెట్రో సదుపాయం ఉన్న అన్ని 10 నగరాలు అయిన ఢిల్లీ, నోయిడా, గురుగావ్, బెంగళూరు, హైదరాబాద్, కోల్ కత్తా, ముంబై, చెన్నై, లక్నో, కొచ్చి మరియు జైపూర్లలో అందుబాటులో ఉంది. ఈ అంశం, మీ ఆరిజన్ మరియు గమ్యం మధ్య రూట్ ను మాత్రమే సూచించడమే కాకుండా, అంచనావేయబడిన ప్రయాణ సమయం, ఛార్జీలు, మధ్యలో వచ్చు స్టేషన్ల సంఖ్య మరియు మార్పిడి లైన్స్ కోసం అంతరమార్పిడి స్టేషన్ లను కూడా అందిస్తుంది. బహుళ రూట్స్ సంభావ్యత ఉన్న చోట, ఇది మీకు ఉత్తమ రూట్ ను కూడా సూచిస్తుంది, ఇందులో ప్రయాణ సమయం మరియు ప్రయాణ సమయంలో మెట్రో లైన్స్ ను ఎన్ని సార్లు మార్చాలి వంటివాటిని కూడా పరిగణిస్తుంది.