పాప్‌అప్‌సెల్ఫీ కెమెరా, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా తో హువావే వై 9 ప్రైమ్‌ లాంచ్‌

చైనా రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్  లాంచ్‌ చేసింది. హువావే వై 9 ప్రైమ్  పేరుతో  నేడు (ఆగస్టు 1, గురువారం) ఇండియన్ మార్కెట్లో  తీసుకొచ్చింది.  పాప్‌ అప్‌ కెమెరా  సెల్ఫీ కెమెరా,  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ప్రధాన ఫీచర్లుగా  కంపెనీ తెలిపింది.  ధర  రూ.15,990 గా ఉంచింది. 

అమెజాన్‌లో  ప్రైమ్‌ కస్టమర్లకు ఆగస్టు  7వ తేదీ నుంచి, మిగిలిన వారికి 8వ తేదీనుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే  నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యంతోపాటు,  ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్  లభించనుంది. అమెజాన్ పే ద్వారా కొంటే రూ.500 డిస్కౌంట్ ఇస్తారు. అలాగే జియో కస్టమర్లకు రూ.2200 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. 

హువావే వై9 ప్రైమ్ ఫీచర్లు
6.7 అంగుళాల ఫుల్ వ్యూ  డిస్‌ప్లే
ఆక్టాకోర్‌ కిరిన్ 710 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9.0 పై
4 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్
16+ 8+ 2 ఎంపీ  ట్రిపుల్ రియర్‌ కెమెరా
16 ఎంపీ  సెల్ఫీ కెమెరా
 4 000 ఎంఏహెచ్‌ బ్యాటరీ