పవన్ కల్యాణ్ ను కలిసిన సోము వీర్రాజు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పవన్ ను సోము వీర్రాజు కలవడం ఇదే తొలిసారి. ఏపీలో జనసేన, బీజేపీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పవన్ ను వీర్రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీర్రాజుకు శాలువా కప్పి పవన్ అభినందించారు. అనంతరం ఇరువురు కలిసి పలు విషయాలపై చర్చించారు. రానున్న రోజుల్లో ఇరు పార్టీలు ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు, నిన్న సినీ నటుడు చిరంజీవిని కూడా సోము వీర్రాజు కలిశారు. ఈ సందర్భంగా వీర్రాజును అభినందించిన చిరంజీవి… ఏపీ అభివృద్ధిలో జనసేన, బీజేపీ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.