అమరావతి: తెలుగు సినీ లెజెండ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనను అభినందించారు. బాలకృష్ణ తన తండ్రి లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేశారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అంకితభావంతో సేవలు అందించిన బాలకృష్ణ, ప్రజా సంక్షేమానికి స్ఫూర్తిగా నిలిచారు. ‘‘ఈ గౌరవం తెలుగు ప్రజల గర్వకారణం,’’ అని చంద్రబాబు అన్నారు.
మంత్రి నారా లోకేశ్ కూడా బాలకృష్ణకు అభినందనలు తెలియజేస్తూ, ‘‘మీ సినిమా, రాజకీయ జీవితంలో చేసిన విశేష సేవలకు ఈ అవార్డు నిదర్శనం,’’ అన్నారు. బసవతారకం ఆసుపత్రి సేవలతో వేలాది మందికి ఆశాకిరణాలు అందించిన బాలకృష్ణ, ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.