పంజాగుట్ట నిమ్స్‌లో ఏడుగురికి కరోనా

నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా పంజాగుట్ట నిమ్స్‌లో ఏడుగురికి  కరోనా సోకడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. నిమ్స్‌ కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఉన్నతాధికారులు దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నిన్న ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది పీజీ వైద్య విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. దీంతో వసతిగృహంలోని మిగతా 284 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఇవాళ నిమ్స్‌లో వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ వైద్య వర్గాల్లో కలకలం