నేడు టీఎస్ ఐసెట్ ఫలితాలు

నేడు టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య సీహెచ్ రాజేశం తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. మే 23, 24 తేదీలలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని మే 20న ప్రకటించారు. జూన్ 1వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు.