నెట్‌మెడ్స్‌ కొనుగోలు యత్నాల్లో రిలయన్స్‌ !

జియో ప్లాట్‌ఫామ్స్‌ విభాగంలోకి ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్స్‌ పార్టనర్స్‌ నుంచి పెద్దఎత్తున మూలధన నిధులు సమీకరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా ఆన్‌లైన్‌ ఫార్మసీ రిటైలింగ్‌ విభాగంలోకి అడుగుపెట్టే సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ‘నెట్‌మెడ్స్‌’ అనే ఆన్‌లైన్‌ ఫార్మసీలో మెజార్టీ వాటా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు సాగిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. నెట్‌మెడ్స్‌ 2015లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ సంస్థ మూడు దఫాలుగా 100 మిలియన్‌ డాలర్ల మేరకు నిధులు సేకరించింది. ఆర్బిమెడ్‌, మేప్‌ అడ్వైజరీ, సిస్టెమా ఆసియా ఫండ్‌… తదితర సంస్థలు దీనికి నిధులు సమకూర్చాయి. గత కొంతకాలంగా ఆన్‌లైన్‌ విభాగంలో బాగా విస్తరించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో నెట్‌మెడ్స్‌ను సొంతం చేసుకున్న పక్షంలో ఆన్‌లైన్‌ ఫార్మసీ రిటైలింగ్‌లో పాగా వేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అవకాశం లభిస్తుంది.