లెబనాన్ రాజధాని బీరూట్‌ను వణికించిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. భయంతో ప్రజలు వీధుల వెంట పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎరువులు, బాంబుల తయారీలో ఉపయోగించే 2750 టన్నుల అల్యూమినియం నైట్రేట్‌ను ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా ఆరేళ్లుగా పోర్టు ప్రాంతంలో నిల్వచేశారని అధ్యక్షుడు మేఖేల్ ఔన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్ర నిర్లక్ష్యమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
