పోలో హెల్త్ మరియు లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు చెందిన భారతదేశంలో పేరెన్నికగన్న డయగ్నోస్టిస్ సేవల సంస్థ అపోలో డయగ్నోస్టిక్ నిజామాబాద్‌లో నేడు తన నూతన శాటిలైట్ ల్యాబ్ ప్రారంభించింది. అపోలో గ్రూప్ యొక్క 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కూడిన నైపుణ్యతకు చెందిన మార్గదర్శకత్వంలో అపోలో డయగ్నోస్టిక్ సేవలు 2015లో ప్రారంభం అయ్యాయి.ఈ ల్యాబ్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల, భారతదేశవ్యాప్తంగా అపోలో 550 డయగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా సేవలు అందించనుంది. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ నూతన శాటిలైట్ ల్యాబ్‌లోని అధునాతనమైన సదుపాయాలతో 3500కి పైగా వ్యాధి నిర్ణయపరీక్షలు (పాథాలజీ) నిర్వహించుకోవచ్చు. దీనికి కొనసాగింపుగా, 8-10 కలెక్షన్ కేంద్రాలను నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నారు. తద్వారా రోగులు నాణ్యమైన రోగ విశ్లేషణ (డయగ్నోస్టిక్) సేవలు సులభంగా పొందే వీలు కలుగుతుంది.
నిజామాబాద్ ఐఎంఏ అధ్యక్షురాలు, డాక్టర్ కవితారెడ్డి ఎండీ, డీజీఓ ఈ కొత్త శాటిలైట్ ల్యాబ్‌ను ప్రముఖవైద్యులు మరియు అపోలో సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు.
ప్రతి ఏటా అపోలో డయగ్నోస్టిక్ గ్రూప్ 3.5 మిలియన్లకు అత్యంత నాణ్యమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. సంస్థ అందించే నాణ్యమైన సేవలు, అందుబాటు ధరల్లోనే సమీపంలో ఉత్తమమైన సేవలు పొందడం వల్ల గ్రూప్ యొక్క సేవలు విశేష రీతిలో వృద్ధి చెందడం, పెద్ద ఎత్తున శాఖల విస్తరణ జరుగుతోంది. 2015లో 100కు పైగా అపోలో డయగ్నోస్టిక్ సెంటర్లు ఉండగా, 2016లో వీటి సంఖ్య 150కి పైగా చేరింది. 2017లో 250 కలెక్షన్ సెంటర్లు మరియు ఒక నేషనల్ రిఫరెన్స్ ల్యాబ్, 4 రీజినల్ రిఫరెన్స్ ల్యాబ్‌లు, 30కి పైగా శాటిలైట్ ల్యాబ్‌లు మరియు 20కి పైగా హెచ్ఎల్ఎంలతో సేవలు అందిస్తోంది.2018లో 550కి పైగా డయగ్నోటిక్ సెంటర్లు మరియు ఒక నేషనల్ రిఫరెన్స్ ల్యాబ్, 4 రీజినల్ రిఫరెన్స్ ల్యాబ్‌లు, 30కి పైగా శాటిలైట్ ల్యాబ్‌లు, 30కి పైగా హెచ్ఎల్ఎంలు, 5కి పైగా ఆర్ఎల్ఎంలతో సేవలు అందిస్తోంది. 700కి పైగా పేషెంట్ కేర్ సెంటర్లు మరియు ఒక నేషనల్ రిఫరెన్స్ ల్యాబ్, 4 రీజినల్ రిఫరెన్స్ ల్యాబ్‌లు, 40కి పైగా శాటిలైట్ ల్యాబ్‌లు, 45 పైగా హెచ్ఎల్ఎంలు, 10కి పైగా ఆర్ఎల్ఎంలను 2019లో కలిగి ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అపోలో డయగ్నోస్టిక్కు చెందిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పరికరాలు, ఖచ్చితత్వం మరియు తక్షణమే అందించే సేవల వల్ల వినియోగదారులు మెరుగైన సేవలు పొందగలుగుతున్నారు.
ఈ సందర్భంగా అపోలో హెల్త్ మరియు లైఫ్‌స్టైల్ లిమిటెడ్ సీఈఓ శ్రీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “మూడు దశాబ్ధాలకు పైగా అనుభవం కలిగిన వైద్యారోగ్య సేవలు అందించే సంస్థ అయిన అపోలో రోగులకు చికిత్స అందించడం మరియు వారి సమస్య పరిష్కారంలో రోగ నిర్ధారణ పరీక్షలు పోషించే కీలక పాత్ర గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉంది. విస్తృత శ్రేణిలో మరియు ఉత్తమమైన సేవలను మేం అందిస్తున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి చెందిన పరికరాలు మరియు సుశిక్షితులైన సిబ్బందితో సేవలు అందించే మా డయగ్నోస్టిక్ మరియు పాథాలజీ ల్యాబ్ ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే ఆయా పరీక్షల ద్వారా గుర్తించనుంది. నిజామాబాద్‌లో శాటిలైట్ ల్యాబ్ ఏర్పాటు ఈ విధానం వైపు సాగడంలో ఒక భాగంగా నిలువనుంది మరియు ఈ ల్యాబ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని విశ్వసిస్తున్నాం.“అని తెలిపారు.