నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను కొనుగోలు చేసిన టీవీఎస్‌

దేశంలో ప్రముఖ టూవీలర్‌ తయారీదారు టీవీఎస్‌ మోటార్స్‌.. ఇంగ్లండ్‌లో ప్రసిద్ధ మోటార్‌సైకిళ్ల బ్రాండ్‌ అయిన నార్టన్‌ను కొనుగోలుచేసింది. ఈ డీల్‌ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్‌ మోటార్స్‌ ప్రకటించింది. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ ఈ మేరకు నార్టన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నార్టన్‌కు చెందిన అన్ని ఆస్తులు, నార్టన్‌, దానికి సంబంధించిన అన్ని బ్రాండ్‌లను సోంతం చేసుకున్నామని వెల్లడించింది. నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన జేమ్స్‌ లాన్స్‌డౌన్‌ నార్టన్‌ 1898లో ప్రారంభించారు. నార్టన్‌కు చెందిన వీ4 ఆర్‌ఆర్‌, డామినేటర్‌, కమాండో 961 కేఫ్‌ రేసర్‌ ఎంకే-2, కమాండో 961 స్పోర్ట్‌ ఎంకే-2లు మోడళ్లు అత్యంత ప్రసిద్ధిచెందాయి.