నాణ్యమైన వైద్యం కోసమే బస్తీ దవాఖానాలు

పేదల ప్రాథమిక ఆరోగ్యానికి బస్తీ దవాఖానాలు అండగా నిలుస్తాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వీటి ఏర్పాటుపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని.. నాణ్యమైన ప్రాథమిక వైద్యం కోసమే బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇవాళ కొత్తగా 45 బస్తీ దవాఖానాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.