నాగ్ చేతుల మీదుగా విడుద‌లైన చి.ల‌.సౌ ట్రైల‌ర్

అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో అందాల రాక్షసి ఫేం రాహుల్‌ రవీంద్రన్ తెర‌కెక్కించిన చిత్రం చి.ల‌.సౌ. ఆగ‌స్ట్ 3న చిత్రం విడుద‌ల కానుంది. కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్‌ని నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాల‌తో పాటు డైలాగ్స్ కూడా ఆస‌క్తిని పెంచుతున్నాయి. సుశాంత్‌ని ప్ర‌తి ఒక్క‌రు పెళ్ళి చేసుకోమ‌ని చెప్ప‌డం, ఆయ‌న‌ అఇష్టం చూపించ‌డం వంటి స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఆ మ‌ధ్య విడుద‌లైన టీజ‌ర్‌లో హీరోయిన్‌.. ప్ర‌తి ఒక్క‌రికి క‌త్రినా కైఫ్ కావాలి అనుకుంటారు, కాని ఎవ‌డు ర‌ణ్‌బీర్ లా ఉండ‌రు అని అంటుంది. ఈ డైలాగ్స్‌ని బ‌ట్టి చూస్తుంటే చి.ల‌.సౌ మూవీ మంచి ఎంట‌ర్‌టైనింగ్ ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. రుహని శర్మ చి.ల‌.సౌ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. సుశాంత్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో వెన్నెల కిషోర్‌ నవ్వులు పంచనున్నారు. . సుశాంత్ చివరిగా ఆటాడుకుందాం.. రా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *