నాగార్జున సిమెంట్‌ ప్రచారకర్తగా వరుణ్‌ తేజ్‌

ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీ స్‌కు చెందిన నాగార్జున సిమెంట్‌కు టాలీవుడ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు వరుణ్‌ తేజ్‌తో ఎన్‌సీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రచార వ్యూహాన్ని మరింత అధునాతనంగా తీర్చిదిద్దడానికి వరుణ్‌ తేజ్‌ ప్రచా రం దోహదం చేస్తుందని కంపెనీ తెలిపింది. వరుణ్‌ తేజ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం సంతోషంగా ఉందని ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ కే రవి తెలిపారు.