నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్‌ కొంత సమయానికి స్వల్పంగా కోలుకున్నప్పటికీ.. కాసేపటికే సూచీ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది.దీంతో 242.37 పాయింట్లు నష్టపోయి 31,443.38 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 71.85 పాయింట్లు నష్టపోయి 9,199.05 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.75గా ఉంది. నిఫ్టీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్‌, కోటక్‌ మహీంద్ర, గెయిల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి.దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. రెండు రోజుల వరుస నష్టాల అనంతరం బుధవారం లాభాల్లోకి వెళ్లిన సూచీలు.. గురువారం ఆ లాభాలను పోగొట్టున్నాయి. దేశంలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం మదుపరిని కలవరపెట్టాయి. దీంతో అమ్మకాలవైపు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి.