దేశవ్యాప్తంగా 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

దిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) ఉత్తర్వులు విడుదల చేసింది. ఆర్థిక వ్యవహారాల పునరుద్ధరణ నిబంధనలను హోం శాఖ ఇస్తుందని ఎన్‌డీఎంఏ తెలిపింది. లాక్‌డౌన్‌ నిబంధనల మార్పు చేర్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయని ఎన్‌డీఎంఏ పేర్కొంది.