దేశంలో మే 3 వరకు లాక్ డౌన్

కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా పై పోరాటమే మన ముందు ఉన్న పెద్ద లక్ష్యం అని మోడీ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు సైనికుడిగా పని చేస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన అందరు అర్థం చేసుకుంటున్నారు. ఈ వ్యాధి ని కట్టడి చేయడంలో అందరు ఒకే తాటి పై ఉన్నారని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మనమే మెరుగుగా ఉన్నామని చెప్పారు. 21 రోజులుగా కట్టడిగా లాక్ డౌన్ పూర్తి చేశారు. డాక్టర్లకు, పోలీసులకు, మీడియాకి, ఇతర సిబ్బందికి అతని అభినందనలు తెలిపారు. మే మూడవ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుంది అని తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు.