దీపక్‌ కొచ్చర్‌ అరెస్ట్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టంలోని సెక్షన్ల కింద ముంబయిలో ఆయనను అరెస్టు చేసినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. వీడియోకాన్‌ గ్రూపునకు రుణాలు మంజూరు చేసిన వ్యవహారంలో మనీలాండరింగ్‌కు, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కొచ్చర్‌ దంపతులను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో చందాకొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌, వాళ్ల కంపెనీలకు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది.