త‌క్కువ ధ‌ర‌కే కొత్త‌ ఐఫోన్ ఎస్ఈ

సెకండ్ జ‌న‌రేష‌న్ స్పెష‌ల్ ఎడిష‌న్ ఐఫోన్‌ను యాపిల్ సంస్థ మార్కెట్లోకి రిలీజ్ చేసింది.  ఐఫోన్ ఎస్ఈ 2020 మోడ‌ల్‌ను మార్కెట్లో 399 డాల‌ర్ల‌కు అమ్మ‌నున్నారు.  ఈ ఫోన్ అచ్చం ఐఫోన్‌8 త‌ర‌హాలో ఉంటుంది. కానీ దీంట్లో అనేక కొత్త ఫీచ‌ర్లు ఉన్నాయి.  64జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధ‌ర‌ను 399 డాల‌ర్లుగా నిర్ధారించారు. 4.7 ఇంచుల స్క్రీన్ ఉంటుంది. హోమ్ బ‌ట‌న్‌కు ట‌చ్ ఐడీ ఇచ్చారు. ఈ శుక్ర‌వారం నుంచి ఆర్డ‌ర్లు మొద‌లుకానున్నాయి. కొత్త ఎస్ఈ ఐఫోన్‌లో ఉన్న 128 జీబీ మోడ‌ల్‌ను 449 డాల‌ర్ల‌కు అమ్మ‌నున్నారు. 256 జీబీ మోడ‌ల్‌ను 549 డాల‌ర్ల‌కు సేల్ చేయ‌నున్నారు. బ్లాక్‌, వైట్‌, రెడ్ క‌ల‌ర్స్‌లో మోడ‌ళ్ల‌ను రిలీజ్ చేస్తున్నారు.  ఈ ఫోన్లు కొన్న‌వారికి ఏడాది పాటు యాపిల్ టీవీ ప్ల‌స్ ఫ్రీగా వ‌స్తుంది. ఐఫోన్ 11, 11 ప్రో మోడ‌ల్స్‌లో ఉన్న ఏ13 బ‌యానిక్ చిప్‌ను కొత్త ఎస్ఈ ఫోన్‌లో అమ‌ర్చారు. దీని వ‌ల్ల‌ కొత్త ఫోన్ లైఫ్‌స్పాన్ ఎక్కువ‌గా ఉంటుంది.