త్వరలోనే ప్రజా రవాణా : నితిన్‌ గడ్కరీ 

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ మార్గదర్శకాలు ఉండబోతున్నాయని చెప్పారు. ఈ మేరకు కారు, బస్సు ఆపరేటర్స్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.