తెలంగాణలో 42 కేసులు నమోదు

హైదరాబాద్‌: తెలంగాణలో ఇవాళ మరో 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధి నుంచి వచ్చినట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1551కి చేరింది. ఇప్పటి వరకు 34 మంది మరణించారు.