తెలంగాణలో మరో 41 కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి 26 కేసులు వచ్చాయి. మేడ్చల్‌ జిల్లా నుంచి మరో మూడు నమోదు అవ్వగా… 12 మంది వలస కార్మికులకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,592కి చేరింది. ఇప్పటి వరకు 34 మంది రాష్ట్రంలో మరణించారు. ఇవాళ మరో 10 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 556 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.