తెలంగాణలో మరో 40 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో మరో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 404కి చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 348. హైదరాబాద్ నగరంలోనే 171 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో 21 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 150 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా నిజామాబాద్‌లో 36, వరంగల్ అర్బన్ 23, గద్వాలలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.