తెలంగాణలో మరో ఏడుగురి మృతి

తెలంగాణలో కొత్తగా 129 కేసులు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ పరిధిలో 127 నమోదు కాగా.. ఇద్దరు వలస కార్మికులకు కరోనా సోకినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ వెల్లడించింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 108 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3020కి చేరింది. ఇవాళ తాజాగా మరో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99కి చేరింది. ఇప్పటి వరకు 1556 మంది డిశ్చార్జి అవ్వగా.. 1365 మంది చికిత్స పొందుతున్నారు.