తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు

రాష్ట్రంలో బుధవారం 15‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1122కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ రోజు నమోదైన 15 కేసుల్లో 12 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి.. మిగిలిన మూడు వలస కార్మికులవి. నేడు 45మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు మొత్తం 693మంది కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం 400మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 29. కాగా, గత 14రోజులనుంచి 22 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. యాదాద్రి, వరంగల్‌ (రూరల్‌), వనపర్తిలో నేటి వరకు ఒక్క కేసుకూడా నమోదు కాకపోవటం గమనార్హం.