తెలంగాణలో ఈ రోజు 11 కరోనా పాజిటివ్‌లు

తెలంగాణలో ఈ రోజు 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,107కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఈ రోజు 20 మంది డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి మొత్తంగా 648 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 430 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ రోజు నమోదు అయిన  కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *