True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?….. 

Contact Us : [email protected], Call : 9849851841 

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 66 కేసులు నమోదు

తెలంగాణలో కొవిడ్‌ 19 మహమ్మారి విజృంభిస్తోంది.  ఈ రోజు కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  766కు చేరింది. రెండు రోజుల్లో 116 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 30 హైదరాబాద్‌లోనే రాగా.. సూర్యాపేట జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాలలో తొలి కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.