తెదేపానే వైరస్‌ తెచ్చిందంటారేమో!: చంద్రబాబు

వైకాపా నేతలు ఇక కరోనా వైరస్ కూడా తెదేపానే తెచ్చింది అంటారేమోనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి తెదేపాపై ఎదురుదాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. తాత రాజారెడ్డి దారిలోనే సీఎం జగన్‌ నడుస్తున్నారని, తమ అరాచకాలకు అడ్డొచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు.