తిరున్ వారి క్యూయిజ్ రోడ్ షో హైదరాబాద్ లో

సింగపూర్ కు వెళ్ళడానికి రాయల్ క్యారిబ్బియన్ ఇంటర్నేషనల్స్ క్రూయిజ్ లు పరిచయం

వాయేజర్ ఆఫ్ ద సీస్ క్రూయిజ్ 21 అక్టోబర్-11 నవంబర్ 2019 నుండి, 8 మే-19జూన్ 2020 లో రెండవ షెడ్యూల్ కలిగిఉంది, క్వాంటం ఆఫ్ సీస్ క్రూయిజ్ 21 నవంబర్ నుండి 26 ఏప్రిల్ 2020 వరకు ఉంటుంది

తిరున్ ట్రావెల్ మార్కెటింగ్, రాయల్ క్యారిబ్బియన్ ఇంటర్నేషల్ కు భారతదేశంలోని విశిష్ట ప్రతినిధి, 2019-2020 లో ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైనర్, రాయల్ క్యారిబ్బియన్ ఇంటర్నేషనల్స్ క్రూయిజ్ లను సింగపూర్ గురించి ప్రచారం చేయడానికి భారతదేశమంతటా రోడ్ షోను ప్రారంభించింది. ఈ ప్రయాణంలో భాగంగా, ఈ రోడ్ షో, హైదరాబాద్ లో 18 సెప్టెంబర్ న ఐటిసి కాకతీయ బేగంపేటలో నిర్వహించబడుతుంది, ఇది రాబోవు సింగపూర్ ప్రయాణాలలో రెండు రాయల్ క్యారిబ్బియన్ ఇంటర్నేషనల్ వారి ఉత్తమ ఓడల గురించి, వాయేజర్ ఆఫ్ సీస్ మరియు క్వాంటమ్ ఆప్ సీస్ గురిమ్చి వాణిజ్య భాగస్వాములకు తెలపడానికి నిర్వహించబడుతోంది. ఈ రెండు ఫీచర్-లేడెన్ ఓడలు, అతిథులకు సంవత్సరమంతా ఒక అత్యుత్తమ సెలవురోజుల అనుభవాన్ని అందించడానికి సింగపూర్ లో నిలపబడ్డాయి.

ఇటీవలే అత్యధిక ఖరీదైనదిగా అంటే యుఎస్‌డి 97 మిలియన్లగా పునర్నిర్వచించబడిన, వాయేజర్ ఆఫ్ ద సీస్, ఓడల వాయేజర్ తరగతిలో ప్రముఖ ఓడ, రోమాంచనాలకు, చలులకు కేంద్రంగా వివిధరకాల అంశాలకు మరియు సౌకర్యాలకు ఒక జోడింపుగా సిద్ధంగా ఉంది. ఈ ఓడల అంశాలలో, ద పర్ఫెక్ట్ స్ట్రోమ్ వాటర్ స్లైడ్స్ డ్యూవో, వంటి హై-ఆక్టేన్ సాహస రైడ్స్ ఉంటాయి, ప్లానెట్ జెడ్ లేజర్ ట్యాగ్ గేమ్ కోసం కొత్తగా ఆవిష్కరించబడిన యుద్ధం వంటి కుటుంబంపై దృష్టి సారించబడిన వినోదం ఉంటాయి.  మిస్ చేసుకోలేని ఆకర్షణలో మీ ఫేవరెట్స్, అంటే ద ఫ్లోరైడర్ సర్ఫ్ సిమ్యులేటర్, రాక్-క్లెయింబింగ్ వాల్ మరియు మిని-గోల్ఫ్ వంటివి, ఓడలోని యాక్షన్-ప్యాక్డ్ ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ ఓడలో, విశ్రాంతి మరియు పునరుతేజనానికి వైటాలిటీ స్పా మరియు ఫిట్ నెస్ సెంటర్, శిశువులకు ఒక నర్సరీ మరియు టైనీ టాట్స్ మరియు టీన్స్ కోసం ఒక సాహసోపేత ఓషియన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆహార ప్రేమికులకు అనేక డైనింగ్ ఎంపికలున్నాయి. వాయేజర్ ఆఫ్ సీస్, దక్షిణ పసిఫిక్ జలాల గుండా 21 అక్టోబర్-11 నవంబర్ వరకు ఒక 3-రాతుల మరియు 4 రాత్రుల క్రూయిజెస్ గా సింగపూర్ నుండి మలేషియా మరియు థాయిలాండ్ వరకు ప్రయాణించి, 8 మే-19 జూన్ 2020 మధ్యలో వేసవిలో తిరిగి విచ్చేస్తుంది.

ఈ రోడ్ షోపై వ్యాఖ్యానిస్తూ, శ్రీ వరుణ్ చడ్డా, సిఇఓ, తిరున్ ట్రావెల్ మార్కెటింగ్, ఇలా అన్నారు, “భారతీయులకు సింగపూర్ ఒక ప్రఖ్యాత గమ్యంగా ఉంది, మరియు రాబోవు సీజన్ లో, రాయల్ క్యారిబ్బియన్ ఇంటర్నేషనల్ నుండి అంకితమైన ఓడలు, అతిథులకు సంవత్సరమంతా సంపూర్ణ క్యూయిజింగ్ అనుభవం అందిస్తాయి. ఈ ఓడలు, అత్యున్నత ప్రమాణాల సౌకర్యం, సేవా నాణ్యత కలిగి ఉండి, హై సీస్ పై అనేక మొట్టమొదటి సాహసాలతో నిండి ఉంటాయి. మేము రాబోవు నెలలలో, ఈ అనుభవాలను మరింతమంది భారతీయులలో పంచుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాము.”

తిరున్ తో ఈ క్రూయిజ్ లలో ప్రయాణించు అథితులు, తిరున్ వారి సింగపూర్ ఎయిర్ లైన్స్ సహకారంతో అందించబడు ఫ్లై+క్రూయిజ్ ప్యాకేజితో అత్యంత పొదుపులతో హామీ ఇవ్వబడ్డారు. ఈ ప్యాకేజి, అతిథులకు, సింగపూర్ కు విమాన టికెట్లతో పాటుగా, క్రూయిజ్ టికెట్ ఫీజును కూడా నమ్మకశ్యంకాని ధరలలో అందిస్తుంది.