డాక్స్ యప్ కు ఇండస్ట్రీ అచీవ్మెంట్ అవార్డ్

బెంగళూరు కేంద్రంగా దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్ సేవలు అందిస్తున్న స్టార్టప్ ‘డాక్స్‌యాప్’ అరుదైన అవార్డును సొంతం చేసుకొంది. 2017-18 ఏడాదితో పోలిస్తే 2018-19 ఏడాది మంచి పనితీరు కనబరిచి ఆదాయంలో 580 % వృద్ధి నమోదు చేసుకొంది. దీంతో భారత దేశంతో పాటు చైనాలో వివిధ సంస్థల పనితీరు పై అధ్యయనం జరిపి వివరాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచురితం చేసే హురూన్ రిపోర్ట్ సంస్థ “ఇండస్ట్రీ అచీవ్‌మెంట్ అవార్డు”కు డాక్స్‌యాప్  సంస్థను ఎంపిక చేసింది. ఈ మేరకు బెంగళూరులో ఇటీవల జరిగిన కార్యక్రమంలో “ఇండస్ట్రీ అచీవ్‌మెంట్ అవార్డు”ను కోవర్క్స్‌, ఆర్‌ఎంజెడ్ సంస్థ వ్యవస్థాపడుడు, ప్రముఖ వ్యాపారవేత్త సిద్ధార్థ్ మెంద్రా చేతుల మీదుగా డాక్స్‌యాప్ సంస్థ వ్యవస్థపక సభ్యుల్లో ఒకరైన ఎంబశేఖర్‌ అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ‘అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన హురూన్ రిపోర్ట్ సంస్థ మా పనితీరును గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. మా డాక్స్‌యాప్ సంస్థ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ భారత దేశంలోని లక్షలాదిమందికి నాణ్యమైన వైద్యాన్ని అందించింది. భారత దేశంలో అత్యంత నమ్మకమైన ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్ సంస్థగా డాక్స్‌యాప్ గుర్తింపబడిందని చెప్పడానికి నేను ఈ సందర్భంగా ఎంతో గర్విస్తున్నాను. ప్రతి నెల మా సంస్థ ద్వారా 2,00,000 మందికి పైగా వైద్య సేవలు అందుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇందులో 60 శాతానికి పైగా భారత దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే వారే. అంటే భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా మా సంస్థ సేవలు అందుతున్నాయన్న విషయాన్ని మీకు మరో సారి తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు. ఈ అవార్డు అందుకోవడం ద్వారా మా బాధ్యత మరింత పెరిగిందన్నారు. అందివచ్చిన సాంకేతికతను వినియోచించుకొంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య  సేవలను అందించడానికి నాతో పాటు మా సంస్థలోని ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంబశేఖర్ స్పష్టం చేశారు. కాగా, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అజీత్ ఇసాక్ (క్వీస్ క్రాప్), నితిన్ కామత్ (జిరోథా), దిలీప్ సురాన (మైక్రో ల్యాబ్స్)తో పాటు భారత దేశంలోని వివిధ నగరాల కేంద్రంగా తమ సేవలు అందిస్తున్న అనే స్టార్టప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.