టీసీఎల్ నుంచి సరికొత్త శ్రేణి ‘4కే AI ఆండ్రాయిడ్ పీ9.0’ టీవీ!

  • TCL నుంచి కొత్త శ్రేణి P8 సిరీస్ ద్వారా భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక AI ఫంక్షన్‌తో కూడిన 4K AI ఆండ్రాయిడ్ P 9.0 టీవీ; సాధారణ AI TV కంటే మరింత శక్తిమంతమైనది
  • P8 సిరీస్ టీవీ అనేది భారతదేశపు మొట్టమొదటి 4K AI ఆండ్రాయిడ్ పై (9.0) టీవీగా అత్యాధునిక AI ఫీచర్లు అందించనుందిప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, స్మార్ట్ అప్లయన్సెస్‌తో కలిపి లైవ్ డెమోకి ఆతిధ్యమివ్వనున్న TCL 

ప్రపంచపు టాప్-2 టీవీ కార్పోరేషన్‌గా ఉన్న TCL ఇప్పుడు సరికొత్త మరియు వినూత్న శ్రేణి 4K AI టీవీలతో వచ్చేందుకు సిద్ధమైంది. ఇవి అత్యాధునిక గూగుల్-సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ పై (9.0)తో పనిచేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భారతీయ వినియోగదారులు టీవీ చూసే అనుభవాన్ని సమూలంగా మార్చేయనుంది. 2019, ఆగస్ట్ 2వ తేదీన న్యూఢిల్లీలోని ITC మౌర్యలో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో TCL తన P8S, P8E & P8లను ఆవిష్కరించనుంది.

P8S సిరీస్‌లో 65” మరియు 55” వేరియెంట్లు మరియు P8E సిరీస్‌లో 55”, 50”, మరియు 43” వేరియెంట్లు, P8లో 43”, 50” 55” సైజుల్లో ఈ టీవీలు లభించనున్నాయి. మొట్టమొదటిసారిగా ఈ తరహా విశిష్టలతో వస్తోన్న ఈ టీవీలు అత్యద్భుతమైన గాడ్జెట్ రూపంలో వినియోగదారులకు హ్యాండ్స్-ఫ్రీ టీవీ కంట్రోల్ అనుభవాన్ని అందించనున్నాయి. అంతే కాకుండా స్మార్ట్ ఫ్యాన్, రోబోట్ స్వీపర్స్, కర్టెన్లు, లైట్లు మొదలైన స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కూడా ఈ సందర్భంగా వినియోగదారుల ముందుకు తీసుకురానున్నారు. P8S అనేది ప్రతిష్టాత్మక మోడల్‌గా రావడంతో పాటు భారతదేశంలో ఒక బేజెల్-లెస్ ఫుల్-స్క్రీన్ డిజైన్‌తో పాటు మెటాలిక్ ఫ్రేమ్‌తో ఆకట్టుకోనున్నాయి. P8 మోడల్ ప్రారంభ ధర రూ. 27990/-, P8E మోడల్ ప్రారంభ ధర రూ. 29990/-, P8S శ్రేణి రూ. 44990/- నుంచి మొదలవుతాయి.

గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ సర్టిఫికేట్ కలిగిన ఈ తాజా LED UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ DTV అనేది సింపుల్ వాయిస్ కంట్రోల్‌తో అత్యద్భుత అనుభవాన్ని అందించడం కోసం AIని ఉపయోగిస్తుంది. అలాగే, AI ఆధారితమైన ఈ లేటెస్ట్ టీవీ అనేది రిమోట్ కంట్రోల్ అవసరం లేకుండా ఒక గాడ్జెట్ లాగా నిరంతరాయంగా పనిచేస్తుంది. AI ఫెయిర్‌ఫీల్డ్ సాంకేతికత ద్వారా, సంవృద్ధమైన ఇమేజ్ మరియు సౌండ్ ఇంజనీరింగ్‌తో ఈ టీవీ తన వినియోగదారులకు అత్యంత గొప్ప టీవీ చూసే అనుభవం అందిస్తుంది. అదనంగా, స్పోర్ట్స్ మోడ్ ఫీచర్‌తో ఆన్-గోయింగ్ మ్యాచ్ దృశ్యాన్ని సంవృద్ధం చేయడం ద్వారా అత్యంత డైనమిక్ మరియు ఎడ్జీ స్పోర్ట్స్ చూస్తున్న అనుభవం అందిస్తుంది.

డిజిటల్ అవగాహన కలిగిన వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, TCL తీసుకొచ్చిన ఈ తాజా టీవీలో నెట్‌ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ లాంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పరిశ్రమ అగ్రగాములుగా ఉన్న హాట్‌స్టార్, యుప్‌టీవీ, వూట్, ఆల్ట్ బాలాజీ, మరియు ఇంకా అనేక సంస్థలతో భాగస్వామ్యం ద్వారా TCL అందించే ఖరీదైన గ్యాలరీని సైతం వినియోగదారులు అందుకోవచ్చు.

ఈ పూర్తి శ్రేణి 4K AI ఆండ్రాయిడ్ టీవీలనేవి భారతదేశంలోని వినోదరంగం భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఎందుకంటే, AI సాంకేతికత మరియు ఆండ్రాయిడ్ పై (9.0) స్మార్ట్ టీవీల్లో అత్యద్భుతమైన ఆవిష్కరణలుగా తెరమీదకొస్తున్నాయి. AI ఆల్గారిథమ్ ద్వారా ఇవి అత్యద్భుతమైన పిక్చర్ మరియు సౌండ్ క్వాలిటీ అందిస్తాయి. భారత మార్కెట్ మీద TCL బ్రాండ్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, ఈ బ్రాండ్ హౌస్ నుంచి ఈ సిరీస్ వినియోగదారుల ముందుకొస్తోంది. స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ విభాగంలో ఈ బ్రాండ్ స్థానాన్ని ఇది మరింత పటిష్టం చేయనుంది. 38 సంవత్సరాల వారసత్వం కలిగిన TCL తన భారతీయ వినియోగదారులకు అత్యాధునిక ఆవిష్కరణలు అందించడం ద్వారా వారి జీవితాన్ని స్మార్ట్ గా మరియు సులభంగా మార్చే లక్ష్యంతో ముందుకెళ్తోంది. TCL నుంచి స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ టెక్నాలజీ ద్వారా రానున్న రోజుల్లో ఇలాంటి ఆవిష్కరణలెన్నో తెరమీదకు రానున్నాయి.

ఈ టీవీల ఆవిష్కరణ సందర్భంగా, TCL తన వినియోగదారుల కోసం లైవ్-డెమో సెషన్లు నిర్వహించనుంది. తద్వారా, AIతో పనిచేసే వాయిస్ కంట్రోల్స్ తో టీవీని మాత్రమే కాకుండా ఇతర స్మార్ట్ హోమ్ ఉపకరణాలను ఎలా పనిచేయించవచ్చో ప్రదర్శించనుంది. అంతేకాకుండా, ఈ ప్రారంభోత్సవంలో భాగంగా P8E మరియు P8S సిరీస్ పూర్తి శ్రేణిని అందుబాటులోకి తేవడంతో పాటు ఇలాంటి ఆవిష్కరణలు మరెన్నింటినో పరిచయం చేయనున్నారు.

తాజా అభివృద్ధి గురించి TCL ఇండియా – మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ మైక్ చెన్ మాట్లాడుతూ, “భారతదేశపు వినియోగదారుల కోసం P8 సిరీస్‌ను అధికారికంగా ప్రారంభిస్తుండడం మాకెంతో ఆనందంగా ఉంది. మా తాజా సిరీస్ అనేది భారతదేశంలోని స్మార్ట్ హోమ్ ఉపకరణాల విభాగంలోనే కాకుండా స్మార్ట్ టీవీల విభాగంలోనూ ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభించనున్నాయి. ఈ విభాగంలో నెలకున్న యథాతథ స్థితి దాటి ముందుకు వెళ్లడం కోసం మేము కృత్రిమ మేథస్సులోని సరికొత్త ఆవిష్కరణలను వినియోగించాము. తద్వారా, మా వినియోగదారులకు ఒక పరిపూర్ణ మరియు నిరంతరాయ అనుభవం అందించడానికి సిద్ధమయ్యాం. అలాగే, మా వినియోగదారుల కోసం లైవ్-డెమో అందించడానికి కూడా మేము ఆతృతగా ఎదురుచూస్తున్నాము. 4K AIతో పనిచేసే ఒక స్మార్ట్ టీవీ ఏవిధంగా ఒక స్మార్ట్ హోమ్ గాడ్జెట్‌గా మారిపోయిందో చూపించడం ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ డివైజ్‌లను వాయిస్ కమాండ్ల ద్వారా ఎలా పనిచేయించవచ్చో ప్రదర్శించనున్నాము. తాజా ఉత్పత్తుల ఆవిష్కరణతో మా వినియోగదారులకు నిరంతరాయ అనుభవాన్ని అందించడానికి మేము ఉద్విగ్నభరితంగా ఎదురు చూస్తున్నాము. అలాగే, మా వినియోగదారుల స్మార్ట్ మరియు వినూత్న జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మరెన్నో ఆశ్చర్యాలను రానున్న రోజుల్లోనూ అందించనున్నాం” అన్నారు.