టీమ్‌ఇండియా పర్యటనపై హామీ ఇవ్వలేదు

ఆగస్టులో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన గురించి హామీ ఇవ్వలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌ అన్నారు. అవకాశాలపై చర్చలు మాత్రమే జరిగాయని స్పష్టం చేశారు. పర్యటనకు బీసీసీఐ అంగీకరించిందన్న దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం ప్రకటనతో ఆయన విభేదించారు. ఆగస్టులో దక్షిణాఫ్రికాలో మూడు టీ20లు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం సీఈవో జాక్వెస్‌ ఫాల్‌, డైరెక్టర్‌ గ్రేమ్‌స్మిత్‌ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధుమాల్‌ అంగీకరించలేదు