టీచర్‌ పై యాసిడ్‌ దాడి

హైదరాబాద్‌ లోసి జీడిమెట్ల చింతల్‌లో దారుణం జరిగింది. ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ సూర్యకుమారిపై దుండగుడు యాసిడ్‌ దాడి చేశాడు. దీంతో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగుడు ముఖానికి కర్చీఫ్ కట్టుకొని వచ్చి యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దుండగుడి కోసం గాలిస్తున్నారు.