రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తూ పలు సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర సీడ్స్‌మెన్ అసోషియేషన్ రూ. 3కోట్లు విరాళం ప్రకటించింది. ఇందులో రూ. 1.16 కోట్లు విరాళానికి సంబంధించిన చెక్కును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సంస్థ ప్రతినిధులు ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి అందించారు. మరో రూ. 1.70 కోట్లు విరాళానికి సంబంధించిన చెక్కును సీడ్స్‌మెన్ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు ఏఎస్ఎన్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. మిగతా రూ. 14 లక్షలు వివిధ జిల్లాల నుంచి రాగానే అందజేస్తామని వారు చెప్పారు. ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన సీడ్స్‌మెన్ అసోషియేషన్ను మంత్రులు అభినందించారు.
