టిడిపి యూ టర్న్ తీసుకోలేదుః టిజి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు నోటీస్ ఇచ్చామని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ తెలిపారు. రేపు రాజ్యసభలో ఈ అంశం చర్చకు వస్తుందని భావిస్తున్నామన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు యూటర్న్ తీసుకోలేదని, కేంద్రమే యూటర్న్ తీసుకుందని ధ్వజమెత్తారు. రాయలసీమకు ఇచ్చిన రూ. 350 కోట్లు వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. నిధులు వెనక్కి తీసుకోవడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు.